ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి!

Laitha Tripura Sundari ammavarini poojisthe ashta aishwaryaalu siddhisthaayi

02:51 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Laitha Tripura Sundari ammavarini poojisthe ashta aishwaryaalu siddhisthaayi

వచ్చేవి శరన్నవరాత్రులు. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఇక అమ్మవారు అనేక రూపాలు. ముఖ్యంగా త్రిపుర సుందరి/మహా త్రిపుర సుందరి(షోడసి, లలిత, రాజరాజేశ్వరి)రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కలది పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు. త్రిపుర అంటే ముల్లోకములు. సుందరి అంటే అందమైనదని అర్ధం. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్ధం.
భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది. స్థూల(భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది.

బహిర్యాగంతో పూజించబడుతుంది. సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించారు. పర(మహోన్నతం): అంతర్యాగం(యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడేది. కదంబవృక్షములు(కమిడి చెట్లు)వనముందు నివసించేది. ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు(ఆనందిపచేయు) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎత్తైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అయిన త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే మనం ఇది చదవాలసిందే.

1/14 Pages

1. పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ!

English summary

Laitha Tripura Sundari ammavarini poojisthe ashta aishwaryaalu siddhisthaayi