అమ్మో బాలయ్యను పార్వతి ఎంతమాట అనేసింది

Lakshmi Parvathi in Villian roile for NTR's Biopic

11:27 AM ON 8th February, 2017 By Mirchi Vilas

Lakshmi Parvathi in Villian roile for NTR's Biopic

వివాదం ముందు పుట్టి ఆతర్వాత మనం పుట్టామా, లేక వివాదం మనకు ఆనవాయితీయా.. కాకపొతే, ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానంటూ నందమూరి బాలకృష్ణ చేసిన సంచలనం సృష్టిస్తే.. మరోపక్క అలా గానీ తీశారో కోర్టుకి వెళ్తా అంటూ హెచ్చరికలు వస్తున్నాయి. అసలు అలాంటి సినిమాను సమర్థంగా తీయగల డైరెక్టర్ ఎవరు అన్నదానిపై ఇప్పటికే ఆసక్తికర చర్చ మొదలైపోయింది. వివాదమూ రాజుకుంది. ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తే అందులో విలన్ ఎవరు? అన్నదానిపై మరింత చర్చ సాగుతోంది. ఇంకెవరు అందులో విలన్ ఎవరైనా ఉన్నారంటే.. అది లక్ష్మీపార్వతేనంటూ ఏపీ ఎమ్మెల్యే బోండా ఉమ వివాదం రాజేశారు. ఓ డిబేట్ సందర్భంగా లక్ష్మీపార్వతిని విలన్ అనేసారు. ఇక ఆమె ఊరుకుంటుందా? అందుకే విలన్ అనే అంశంపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కాస్త ఘాటుగానే స్పందించారు.

బాలయ్య ఎన్టీఆర్ సినిమా తీస్తే తాను సదా స్వాగతిస్తానని, అయితే సినిమాను వక్రీకరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబును హీరోగా చూపించి.. తనను విలన్ ను చేస్తే మాత్రం కోర్టుకు వెళతానని హెచ్చరించారు. చంద్రబాబు వెన్నుపోటును చూపించకుండా కథను వక్రీకరించే ప్రయత్నం చేసి, ఎన్టీఆర్ కు అన్యాయం చేస్తే సహించేది లేదని, ఎన్టీఆర్ భార్యను బతికే ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బాలకృష్ణకు సూచించారు. ఎన్టీఆర్ పై సినిమా తీస్తే.. ఆయన చేసిన గొప్ప పనులను ప్రజలకు చూపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా ఆవిష్కరించడం.. ఆయన కుమారుడిగా బాలయ్య అదృష్టమని అన్నారు. ధైర్యముంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చూపించాలని, లేదంటే ఆయన గొప్పతనం, ఆయన సాధించిన విజయాల వరకే పరిమితం కావాలని సూచించారు. అలా కాకుండా తన బావ చంద్రబాబు ఏదో గొప్పోడని, పార్టీని నిలబెట్టాడని, ఆమెనే ఓ దుష్టశక్తి అని తనను విలన్ గా చూపిస్తే క్షమించబోనని స్పష్టం చేశారు.

ఒకవేళ అలా చేస్తే కచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కుతానని కుండబద్దలు కొట్టారు. దీనిపై ముందే ఆలోచించుకుని ప్రజలకు ఆదర్శమైన ఓ ఎన్టీఆర్ ను చూపిస్తారా? లేదంటే వెన్నుపోటు పొడిచిన వాళ్ల గురించి చూపిస్తారా? అనేది నిర్ణయించుకోండి. లేదూ దానిని మసిపూసి మారేడు కాయ చేసి.. తలకిందులుగా చేసి చూపిస్తే మాత్రం ఎన్టీఆర్ భార్యను బతికే ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరించారు. ఇప్పటిదాకా తాను పోరాడేది కూడా అదే అంశంపైనేనని, ఇప్పుడు కూడా కథను వక్రీకరిస్తే పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా ఇంకా సినిమా గురించి రూపురేఖలు రాకుండానే వివాదం చుట్టముట్టడం విశేషం.

ఇది కూడా చూడండి: మీ అర చేతిలో ఇలాంటి గుర్తు ఉంటె మీకు తిరుగులేదు

ఇది కూడా చూడండి: పెళ్ళికి రెడీయా... అయితే ఏ తేదీలు అనుకూలమో తెలుసుకోండి

English summary

A.P. MLA Bonda announced that Lakshmi parvathi will be the villian for NTR's Biopic