పవన్ కు సాధ్యం కాదు.. బాలయ్యకు శక్తి లేదు.. గాలి తీసేసిన లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi sensational comments on Pawan Kalyan and Balakrishna

04:04 PM ON 14th July, 2016 By Mirchi Vilas

Lakshmi Parvathi sensational comments on Pawan Kalyan and Balakrishna

దివంగత ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర రాస్తానని వచ్చి, ఏకంగా జీవితంలోకి ప్రవేశించిన నందమూరి లక్ష్మీ పార్వతి అప్పుడప్పుడు మీడియా ఎదుట సంచలన వ్యాఖ్య లు చేయడంలో దిట్టగా నిలిచారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు వీరిద్దరూ రాజకీయాల్లో విజయవంతం కాలేరని ఆమె తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న, ఇక బాలయ్య అమాయకుడని.. ఆయనకు పార్టీ నడిపేంత శక్తి లేదని లక్ష్మీపార్వతి సైటర్ వేశారు.

ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవే రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయాడని పార్వతమ్మ పేర్కొంటూ, ఇక పవన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా నిలవడం సాధ్యం కాదని ఆమె గాలి తీసేసారు. పవన్ కూడా చాలా మందిలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతిలో మోసపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. ఇక అమాయకుడైన బాలయ్యకు పార్టీ నడిపేంత శక్తి లేదని , అసలు రాదని ఆమె వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పై లక్ష్మీపార్వతి ప్రశంసల జల్లు కురిపించారు. ఒకప్పుడు దేవతలు క్షీరసాగ మథనం చేస్తే ముందు విషమే వచ్చిందని..

అయినా దేవతలు అమృతం సాధించే వరకు విశ్రమించలేదని.. అలాగే జగన్ కూడా అనుకున్నది సాధించేవరకు పోరాడతాడని ఆమె విశ్లేషించారు. జగన్ లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని.. లక్ష్యాన్ని చేరే వరకు పోరు విరమించరని ఆమె అంటోంది. చిన్నపిల్లాడైన జగన్ తండ్రిని కోల్పోయిన బాధలో ఉంటే.. సోనియా గాంధీతో కలిసి అతడిపై కేసులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని లక్ష్మీ పార్వతి ఘాటుగా విమర్శించారు. కనీసం జగన్ కు నిలదొక్కుకునే అవకాశం లేకుండా చేసి.. జైలుకు పంపించారని ఆమె అన్నారు. వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు, జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసే ముందు తమ మనసుల్ని ప్రశ్నించుకోవాలని ఆమె హితవు పలికారు.

తనను అందరూ అవమానించి రోడ్డు మీద నిలబెట్టిన సమయంలో జగన్ ఓ కొడుకులా తనను ఆదరించి, పోరాడేందుకు ఓ వేదిక కల్పించాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. మొత్తానికి పార్వతమ్మ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఒంటి కాలిపై లేస్తున్నారు. ఇక పవన్ అభిమానులు కూడా విమర్శల వాన కురిపిస్తున్నారు.

English summary

Lakshmi Parvathi sensational comments on Pawan Kalyan and Balakrishna