నమ్మలేని నిజం ... హాలీవుడ్ నటి ఇంట లక్ష్మీపూజ

Lakshmi pooja in hollywood actress home

12:00 PM ON 7th February, 2017 By Mirchi Vilas

Lakshmi pooja in hollywood actress home

డబ్బంటే ఎవరికీ చేదు .. అయినా డబ్బుకోసం ఎలాంటి పనైనా చేయడానికి వెనుకాడని రోజులు కూడానూ... కొందరు నిజాయితీగా, ధర్మ బద్ధంగా సంపాదిస్తూ, లక్ష్మీ దేవిని కొలిచే వాళ్ళు వున్నారు. ఎందుకంటే, సిరి సంపదలకు నెలవైన లక్ష్మీదేవిని కొలవడం అంటే చాలామందికి ఇష్టమే. లక్ష్మీ పూజ భారతీయ సంప్రదాయం. మన సాంప్రదాయాలు, నాగరికత వారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి, ఇక మన సాంప్రదాయాలను చాలా మంది విదేశీ సెలెబ్రిటీలు ఇష్టపడతారనే విషయం చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చాలా మంది విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు గుళ్లకు వెళ్లడంలాంటివి చేస్తూంటారు. కానీ మన దేశ సంప్రదాయం గురించి, మనం ఆరాధించే దైవంగురించి అవగాహన లేని వారు తమ ఇళ్లలో పూజలు చేయడంలాంటివి జరగదు. కానీ ప్రముఖ నటి, గాయని మైలీ సైరస్ తన నివాసంలో లక్ష్మీదేవి పూజ నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచింది.

అమెరికా మొత్తం సూపర్ బౌల్ ఫుట్ బాల్ క్రీడ వైపు ఆసక్తిగా ఉన్న సమయంలో మైలీ సైరస్ లక్ష్మి దేవి పూజ నిర్వహించడం విశేషం. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సూపర్ బౌల్ 2017 నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ సందర్భంగా మైలీ ప్రదర్శన ఇవ్వబోతోంది.షో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తన ఇంటిని పూలమాలలతో అందంగా అలంకరించి పండితులను పిలిపించి లక్ష్మీదేవికి పూజ నిర్వహించిందట. ఈ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తుండడంతో నెటిజన్లు వీరలెవెల్లో కామెంట్స్ పెడుతున్నారు.

ఇది కూడా చూడండి: మీరు బాగుపడాలంటే….. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి.

ఇది కూడా చూడండి: మీ ఒంట్లో అదనపు కొవ్వు వారం రోజుల్లో కరిగించే అద్భుత సూప్

English summary

Hollywood actress had done Lakshmidevi pooja in her house.