అర్ధనగ్న చిత్రాలు ప్రదర్శిస్తున్నారని.. ఏమి చేశారో తెలుసా

Lal Sena Opposed Painting exhibition at jaipur

11:16 AM ON 9th December, 2016 By Mirchi Vilas

Lal Sena Opposed Painting exhibition at jaipur

జైపూర్ నగరంలో కళలపై ఏర్పాటు చేసిన సదస్సులో గందరగోళం చేటుచేసుకుంది. కళల సదస్సులో భాగంగా జైపూర్ లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనలో అర్ధనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ కళాకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయింటింగ్స్ ను ధ్వంసం చేశారు. దీంతో చిత్ర ప్రదర్శన రసాభాసగా మారింది. చిత్ర ప్రదర్శనలో అర్ధనగ్న చిత్రాలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ ‘హిందూ ఏక్ తా’ సంస్థ సభ్యులు, ‘లాల్ సేన’ సంస్థ అధ్యక్షురాలు హేమలత శర్మ కళాకారులపై దాడికి దిగారు. ఓ కళాకారుడిపై చేయి కూడా చేసుకున్నారు. పెయింటిగ్స్ పేరిట మహిళల మనోభావాలతో ఆడుకుంటే ఒప్పుకునేది లేదని హేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చిత్రాలు వేసిన కళాకారులను క్షమించేది లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: టిటిడి బోర్డు సభ్యుడి ఇంట్లో దొరికిన సొమ్మెంతో తెలిస్తే షాకవుతాం (వీడియో)

ఇవి కూడా చదవండి: అమ్మ మరణం వెనుక కుట్ర ?.... మరి చెంపపై ఆ గుర్తులేంటి..?

English summary

A Painting exhibition in Jaipur created sensational because the Hindustani Lal Sena Members were opposed the paints which were painted by the artists and they tried to smash the paintings. Police filed case on this issue and they were in investigation on this case.