లాలూ బుర్రే  బుర్ర.....

Lalu Prasad Wife And Daughter To Elect For Rajya Sabha

04:55 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Lalu Prasad Wife And Daughter To Elect For Rajya Sabha

కొడుకులు మంత్రులు ... భార్యా , కుమార్తె రాజ్యసభకు ......

ఎంతైనా బీహార్ మాజీ సిఎమ్ లాలూ ప్రసాద్ యాదవ్ బుర్రే బుర్ర. మోడీ తో వున్న వైరం కారణం నితీష్ కు దగ్గరైన లాలూ, బీహార్ లో అధికంగా అసెంబ్లీ సీట్లు కొట్టేసారు. తాను సిఎమ్ పదవికి రాజీనామా తప్పదని గ్రహించిన లాలూ భార్య రబ్రీని పీఠం ఎక్కించి, జైలు నుంచే చక్రం తిప్పిన ఘనుడు. అంతెందుకు లాలూతో సభను పంచుకోడానికి ససేమిరా అన్న కేజ్రీ వాల్ తో నితీష్ ప్రమాణ స్వీకార సభలో ఆలింగనం చేసుకునేలా చేసాడు.

రాష్ట్రాల విషయానికి వస్తే , లాలూ తోనే కుటుంబ రాజకీయాలు రంజుగా మారాయి. గడిచిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందిన లాలూ ఇద్దరు కొడుకులను విజయ పదాన నిలిపారు. అంతేకాదు నితీష్ కొలువులో ఒక కుమారుడి ని బీహార్ ఉప ముఖ్యమంత్రిగా చేసేసి , మరో కుమారుడుని ఆరోగ్య శాఖ మంత్రి గా చేసారు.

అంతటితో ఆగారా అంటే అదీలేదు ఇప్పుడు ఏకంగా ఇంట్లో ఉన్న తన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి, కుమార్తె మీసా భారతీని రాజ్యసభకు పంపిస్తారట. ఆర్జేడీ నుంచి వీళ్లిద్దరినీ రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయించాలని తీర్మానం కూడా అయిపొయింది. బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఆర్జేడీ 80 స్థానాలు గెలుచుకుంది. రాజ్యసభ్యకు పోటీ చేసే అభ్యర్థికి 41 మంది శాసన సభ్యులు ఓటు వేస్తే చాలు. ఇప్పుడు మిత్రపక్షాలైన జేడీ(యూ), కాంగ్రెస్ లో ఎవరో ఇద్దరు ఓటు వేస్తే రబ్రీదేవి, మీసా భారతీ రాజ్యసభలో అడుగు పెడుతారని ఆర్జేడీ నాయకులు అంటున్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రబ్రీదేవి ఓడిపోయారు. మీసా భారతీ సైతం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2016 జులై లో జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎంపీలు రిటైడ్ కానున్నారు. అందుకే వీరిద్దరిని రాజ్యసభకు పంపించాలని లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. తాను జాతీయ రాజకీయాలు చూసుకుంటానని, తన సోదరుడు నితీశ్ కుమార్ బీహార్ రాజకీయాలు చూసుకుంటారని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారంటే ఏదో అనుకున్నారు, అయితే ఇప్పుడు తెల్సివస్తోందిగా అంటూ సొంత పార్టీ వాళ్ళే గుసగుసలాడు కుంటున్నారు.

English summary

Lalu Prasad Wife And Daughter To Elect For Rajya Sabha