హత్య కేసు నిందితుడితో 'లాలూ' సన్

Lalu Prasad Yadav Son Tej Pratap Yadav Caught With Criminals

11:25 AM ON 16th September, 2016 By Mirchi Vilas

Lalu Prasad Yadav Son Tej Pratap Yadav Caught With Criminals

నేరమయ రాజకీయాలు తగ్గాలని ఎంత అరచి గీ పెట్టినా రోజురోజుకీ పొల్యూట్ అవుతూనే వున్నాయి. ఎవరు చూసిన అతని కంటే ఘనుడు అన్న చందంగానే వ్యవహరిస్తున్నారు. పైగా ఇది ఫాషన్ అయిపొయింది కూడా. ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఇదే కోవలో నేరస్తులతో చెట్టాపట్టాలేసుకున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అతడు చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది. ఓ హత్యకేసునెదుర్కొంటూ, పరారీలో ఉన్న నిందితుడు మహ్మద్ కైఫ్ తో ఈయన కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సంచలనం రేపాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా పాకిపోయాయి. రాజ్ దేవ్ రంజన్ అనే జర్నలిస్టు హత్య కేసులో కైఫ్ నిందితుడు గా ఉండడం దీనికి కారణం.

ఈ కేసుకు సంబంధించిభాగల్పూర్ జైలు నుంచి ఇటీవలే విడుదలైన ఆర్జేడీ నేత మహ్మద్ షాబుద్దీన్ పక్కన కైఫ్, తేజ్ ప్రతాప్ ఉన్న ఫోటోలు, వీడియోలను కొన్ని ఛానెల్స్ ప్రసారం చేశాయి. కాగా తేజ్ ప్రతాప్ మాత్రం.. కైఫ్ ఎవరో తనకు తెలియదని ఖండించారు. రోజూ తనను ఎంతోమంది కలుస్తుంటారని, వాళ్ళు ఎవరో తనకు ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు.

అటు కైఫ్ కూడా..తేజస్వి యాదవ్ తన యువ ఆశా కిరణమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతో ఆయనకు మద్దతుదారుడిగా తాను వచ్చానని అన్నాడు. తాను క్రికెటర్ నని, యువకులకు శిక్షణ ఇస్తుంటానని, జర్నలిస్టు హత్య కేసుతో తనకు సంబంధం లేదని చెప్పాడు. కాగా ఇదే కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు మహ్మద్ జావేద్ కూడా ఈ ఫోటోలలో కనిపిస్తుండడం మరింత సంచలనం రేపుతోంది.

ఇవి కూడా చదవండి:వందేళ్ల వయసులోనూ సుమ బామ్మ స్పీడు (వీడియో)

ఇవి కూడా చదవండి:ఓనమ్ వేడుకల్లోనూ ఫోర్న్ స్టార్స్

English summary

Bihar Political Leader Lalu Prasad Yadav 's Son and Bihar Health Minister Tej Prathap Yadav was caught with two of the criminals who were in the case on a Journalist Murder case. But Tej Prathap Yadav saying that he will meet so many people daily and how can he know he was a criminal.