మోడ్రన్‌ బీహార్‌ చూపిస్తాడట

Lalu Yadav's Son Tejaswi took charge

01:38 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Lalu Yadav's Son Tejaswi took charge

తండ్రి చాటు బిడ్డగా ఇప్పుడు వరకూ ఉన్న లాలూ తనయుడు 26యేళ్ళ అతి చిన్నవయస్సులోనే ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయిన తేజశ్వి యాదవ్‌ ఇప్పుడు మోడ్రన్‌ బీహార్‌ గళమెత్తాడు. ఉపముఖ్యమంత్రిగాను, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించనున్న యువ కిశోరం తన కార్యాలయానికి వచ్చి అధికార బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజునే చాలా భారీ ఆశయాలను తలనెత్తుకున్నట్లు ప్రభోదించారు. బీహార్‌ను ఇప్పుడు దేశంలోనే ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దటమే తన కర్తవ్యమని పెద్ద మాటలు చెప్పుకొచ్చాడు. రోడ్డు భవనాల శాఖతో పాటు మరో మూడు శాఖలను తన అజమాయిషీలోనే ఉంచుకున్న తేజశ్వికి నిజంగా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఉన్న కేసుల ఊబిలో నుండి బయటకు రాలేని నేపథ్యంలో, ప్రత్యక్ష ఎన్నికలలో లాలూ పోటీ చేయలేని అశక్తత తేజశ్వికి ఇప్పుడు ఈ అధికారాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి నేపథ్యం నుండి వచ్చిన తేజశ్వి ఇప్పుడు మోడ్రన్‌ బీహార్‌ అంటూ, ఉన్న సమస్యలన్నీ పటాపంచలు చేస్తానంటూ చెప్పుకొస్తున్న ప్రగల్భాలు ఎంతవరకూ కార్యరూపం దాల్చుతాయో ఎదురు చూడాల్సిందే.

నిష్కలంకుడిగా పేరుపొందిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ సైతం బీహార్‌ ప్రగతికి ఎంతో కీలకమైన ఎన్నో మంత్రిత్వ శాఖలను లాలూ తనయుడి కిందకు తీసుకురావడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. నితీష్‌ సైతం ఇలా తలగ్గడం ముందుముందు ప్రభుత్వం విధాన నిర్ణయాలపైనా లాలూ వర్గం ముద్ర గట్టిగానే ఉంటుందనే విమర్శలకు ఊతమిస్తోంది. గత ప్రభుత్వాలను నడిపిన తేజశ్వి తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తల్లి రబ్రీదేవి హాయాంలో రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, రోడ్డు రవాణా కునారిల్లింది. నితీష్‌ కుమార్‌ అధికారంలోకి వచ్చేవరకూ కూడా వాటి బాగోగులు చూసుకున్న నాధుడు లేడు. నితీష్‌ పుణ్యమాని ఇప్పుడు బీహార్‌లో పరిస్థితులు కొంచెం మారాయి. అయినా ఏళ్ళ తరబడి పేరుకుపోయిన సమస్యలు రూపుమాపలేదు. ఇప్పుడు యువరాజు రాగానే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోవడానికి ఆయన దగ్గర ఏమన్నా మంత్రదండం ఉండి తీరాల్సిందే.

యువకుడినన్న కారణంగా తనను తక్కువ అంచనా వేయొద్దని, తాను అధ్బుతాలు చూపించగలనని ధీమా వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం బీహార్‌ను ఎక్కడికి తీసుకువెళతారో చూద్దాం.

English summary

Tejaswi Yadav, Son Of Lalu Prasad Yadav Who Elected As Deputy Cheif Minister Of Bihar has Took Charge. At The Age Of 26 He Was Elected As A Deputy Chief Minister Of Bihar Said That He Is Going To Show Modern Bihar In Coming Days