రాజకీయ పార్టీలకు భూములిస్తున్న ప్రభుత్వం!?

Land Distribution To Political Parties In AP

12:03 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Land Distribution To Political Parties In AP

ఇదేమిటి అనుకుంటే, ఏమీ చెయ్యలేం. కొన్ని కొన్ని అంతే.. ఇంతకీ ఏమిటంటే, రాజకీయ పార్టీలకు భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని అమరావతి తోపాటు ఆయా జిల్లాకేంద్రాల్లో వివిధ పార్టీలకు స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాజధానిలో, జిల్లా కేంద్రాలలో 33ఏళ్ల లీజు చొప్పున భూములు కేటాయిస్తారు. శాసనసభలో 50 శాతం కంటే ఎక్కువ బలం ఉన్న పార్టీకి నాలుగు ఎకరాలు, 25 నుంచి 50 శాతం ఉన్న పార్టీలకు అర ఎకరం, 25 శాతం కంటే తక్కువ బలం ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఎపిలో ఆయా పార్టీలకున్న బలాబలాల ప్రకారం టిడిపికి ప్రతి చోట 4 ఎకరాల చొప్పున, ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర ఎకరం భూమి చొప్పున ఇస్తారన్నమాట. అయితే, జాతీయపార్టీ కాంగ్రెస్ కు ఎపిలో ఒక్క సీటు కూడా లేనందున ఆపార్టీకి వెయ్యి గజాల స్థలమైనా దక్కేలా లేదని అంటున్నారు. ఇదెక్కడి భూ కేటాయింపులని జనం మండిపడుతున్నారు.

ఇది కూడా చూడండి: మగాళ్ల జ్ఞాపకార్ధం ఆడాళ్లు నిర్మించిన అద్భుత కట్టడాలు..

ఇది కూడా చూడండి: నెలరోజుల్లో బరువు పెరగడం ఎలా?

ఇది కూడా చూడండి: మిమ్మల్ని పోలిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

Land Distribution To Political Parties In AP.