ల్యాప్ టాప్ సృష్టికర్త ఇకలేడు

Laptop inventor was expired

10:54 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Laptop inventor was expired

సాంకేతిక పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధునిక మానవుడి జీవితంలో కీలక మార్పులు తెచ్చింది. ఇందులో ముఖ్యంగా మొబైల్ కంప్యూటర్ గా ప్రజా జీవనంలో భాగమైపోయిన ల్యాప్ టాప్ ను కనుగొన్న బ్రిటీష్ ఇంజినీర్ జాన్ఎలెన్బై కన్నుమూశారు. ఒక స్మార్ట్ ఫోన్ ఖరీదు కంటే తక్కువకే ల్యాప్ టాప్ మార్కెట్లో దొరుకుతోంది. ఈ మోడ్రన్ ఏజ్ లో ల్యాప్ టాప్ లేని ఆఫీసులు, ఇతర వర్క్ ప్లేసెస్ లు లేవంటే.. దైనందిక జీవితంలో వాటి ప్రభావం ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థమౌతుంది. అయితే, అనేక అవసరాల కోసం ల్యాప్ టాప్ లు వినియోగిస్తున్న తరానికి అసలు దాన్ని కనుగొన్నదెవరో చాలామందికి తెలీదు. ల్యాప్ టాప్ ను మొదట 1982లో జాన్ఎలెన్బై కనుగొన్నాడు.

తొలినాట దీని ధర చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు 8,150 డాలర్లు ధర పెట్టి ఒక్క నాసా, ఆ తర్వాత కొన్ని దేశాలకు చెందిన ప్రభుత్వాలు మాత్రమే కొనుగోలు చేశాయి. 1980ల్లో డెస్క్ టాప్ లు అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతున్న సమయంలో ఎలెన్బై ఈ కంపాస్ అనే ల్యాప్ టాప్ ను కనుగొన్నాడు. అయితే ల్యాప్ టాప్ కనుగొన్న జాన్ఎలెన్బై ఆగష్టు 17న మృతి చెందినట్లు అతడి కొడుకు తెలిపాడు. మరణించేనాటికి ఎలెన్బై వయస్సు 75 ఏళ్లు. పలువురు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి: శని వున్నవారు ఈ పత్రాలతో శివుడ్ని పూజిస్తే శని పోతుందట!

ఇది కూడా చదవండి: వరల్డ్ లో అతి బరువైన సైకిల్ ..బరువెంతో తెలుసా

ఇది కూడా చదవండి: గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?

English summary

Laptop inventor was expired. Laptop inventor Bill Moggridge was expired.