ప్రపంచంలోనే అతి పెద్ద 'నీలం'

Largest blue star sapphire found in Sri Lanka

06:36 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Largest blue star sapphire found in Sri Lanka

ప్రపంచంలోనే అతి పెద్ద నీలం రాయి శ్రీలంకలో లభ్యమైంది. కొలంబోలోని జెమాలజీ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు పరిశీలించి ఈ నీలం బరువు 1404.49 క్యారట్లని వెల్లడించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద నీలం వారు చూడలేదట. ఇంతకన్నా ఎక్కువ బరువుతో ఉన్న నీలం ఏదీ తాము ధ్రువీకరించలేదని చెప్పారు. దీని విలువ సుమారు 100 మిలియన్‌ డాలర్లు. వేలం వేస్తే ఈ బ్లూస్టార్‌ నీలం 175 మిలియన్‌ డాలర్ల వరకు అమ్ముడుపోతుందని దీని యజమాని అంచనా వేస్తున్నారు. దాన్ని చూడగానే కొనుక్కోవాలనిపించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ యజమాని చెప్పారు. శ్రీలంక గనుల్లో నీలం రాళ్లు ఎక్కువగా లభ్యమవుతుంటాయి. అక్కడి విలువైన రత్నాల ఎగుమతుల్లో నీలందే పైచేయి. ఏటా 103 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగుమతులు జరుగుతాయి. ఈ రాళ్ల మధ్యలో ఉండే ఒక ప్రత్యేకమైన గుర్తుని బట్టి వాటిని బ్లూస్టార్‌ సఫైర్స్‌గా పేర్కొంటారు.

English summary

Gemologists in Sri Lanka claim that the largest blue star sapphire yet has been discovered in a mine in the country.