లష్కరే  ఉగ్రవాది అజీజ్‌ అరెస్టు

Lashkar E Taiba Terrorist Arrested

11:37 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Lashkar E Taiba Terrorist Arrested

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో బుధవారం లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్‌ అజీజ్‌ను ఏటీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అజీజ్‌, నగరంలోని రెండు కేసుల్లో నిందితుడుగా వున్నాడు. గణేశ్‌ ఆలయం పేల్చివేత కుట్ర కేసులో అజీజ్‌ ప్రధాన నిందితుడు. అయితే 2003లో బెయిల్‌పై విడుదలైన అజీజ్‌ సౌదీకి పారిపోయాడు. సౌదీ ప్రభుత్వం వెనక్కి పంపడంతో తిరిగి లఖ్‌నవూ చేరుకున్న అజీజ్‌ను ఏటీఎస్‌ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం లఖ్‌నవూలో అజీజ్‌ను తెలంగాణ పోలీసులు ప్రశిస్తున్నట్లు బోగట్టా.

English summary