ఆఖరి అంకం లో బీహార్ ఎన్నికలు

Last Stage Of Bihar Politics

06:46 PM ON 4th November, 2015 By Mirchi Vilas

Last Stage Of Bihar Politics

కీలకమైన బీహార్ ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరింది. నవంబర్ 5వ తేదీన, 5వ విడత పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు. చివరి. దశ పోలింగ్ జరిగే 57 నియోజక వర్గాల్లో 827 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముస్లింలు అధికము గా ఉన్న 6 చోట్ల ఎంఐఎం అభ్యర్థులు రంగంలోకి రావడం కీలకంగా మారింది. హోరా హోరీ గా జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి ఎత్తుగడలు వారు వేసారు. లాలూప్రసాద్ యాదవ్ , నితీష్ కుమార్ జట్టు కట్టిన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాదించడానికి బిజెపి సారధ్యం లోని ఎన్డీఏ పావులు కదుపుతుంది. 5వ తేదీన ఉదయం 7గం నుండి సాయంత్రం 5గం వరకు చివరి దశ పోలింగ్ జరుగుతుంది. నక్సెల్స్ ప్రబావిత నియోజక వర్గాలైన 2 చోట్ల మద్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. నవంబర్ 8వ తేదీన లెక్కింపు జరుగుతుంది.

English summary

Bihar Elections are in Last Stage. FifthStage Of Elections Are On 5th November. MIM party candidates also competiting in the elections.Lalu Prasad Yadav,Nithish Kumar panel wants get lead on BJP's NDA.