చైతూ-సమంతాల నిశ్చితార్ధం అయిపోయిందా.. సాక్ష్యం ఇదిగో..

Latest news about Samantha and Naga Chaitanya engagement

04:18 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Latest news about Samantha and Naga Chaitanya engagement

అక్కినేని నాగచైతన్య-సమంతాల పెళ్లి గురించి ఇటీవలి కాలంలో జరుగుతున్న చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దీనికి తోడు మరో వార్త హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. తాజాగా సమంత చేతి వేలికి నిశ్చితార్థానికి పెట్టుకునే ఉంగరం ఒకటి కనబడుతోంది. ఈ ఉంగరం చూసిన దగ్గర్నుంచి సినీ కుర్రజర్నలిస్టులు ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమంతకు నాగచైతన్యతో రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వారు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు నాగచైతన్య స్వయంగా తన ప్రియురాలు సమంత కోసం ఓ ప్లాటినమ్ ఉంగరం ఒకదాన్ని కొని తెచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలన్నింటిని కొట్టిపారేస్తున్నారు మరికొందరు. అయితే సమంత మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్ చేయడంలేదు మరి. మొత్తం మీద ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. రేపు సమంత చీర కట్టుకున్న మరో పుకారు లేవదీస్తారేమో చూడాలి మరి.

English summary

Latest news about Samantha and Naga Chaitanya engagement