లావా నుంచి మూడు 4జీ స్మార్ట్‌ఫోన్లు 

Lava A88, A71, and X11 4G Smartphones

11:17 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Lava A88, A71, and X11 4G Smartphones

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ లావా కొత్తగా మూడు స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. లావా ఏ88, ఏ71, ఎక్స్‌11 పేరిట విడుదల చేసిన ఈ మూడు ఫోన్లు.. 4జీ సదుపాయంతో పనిచేస్తాయి. లావా ఏ71 ఇప్పటికే మార్కెట్‌లోకి రాగా.. మిగిలిన రెండు ఫోన్లు ఈ నెల మూడో వారంలో అందుబాటులోకి వస్తాయి. లావా ఏ71 ధర రూ.6,499. లావా ఏ88 ధర రూ.5,499 . లావా ఎక్స్11 ధర రూ.7,999.

ఏ71 ఫోన్‌ ఫీచర్లు

5 అంగుళాల తాకే తెర, 1.5 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 2 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 8జీబీ స్టోరేజీ సామర్థ్యం

ఏ88 ఫోన్‌ ఫీచర్లు

5 అంగుళాల తాకే తెర, 1.5 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 2 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 512 ఎంబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4 జీబీ స్టోరేజీ సామర్థ్యం

ఎక్స్‌11 ఫోన్‌ ఫీచర్లు

5 అంగుళాల తాకే తెర, 1.5 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 8 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 2 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 8 జీబీ స్టోరేజీ సామర్థ్యం

English summary