రూ. 4,899కే లావా ఐరిస్ ఆటం 3

Lava Iris Atom 3 Launched

07:06 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Lava Iris Atom 3 Launched

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ లావా కొత్త మోడల్‌ ఫోన్‌ని విడుదల చేసింది. లావా ఐరిస్‌ ఆటమ్‌ 3 పేరిట విడుదల చేసిన ఈ ఫోన్‌ ధరను రూ.4,899కే అందజేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు ఫోన్‌ వివరాలను కంపెనీ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో 5 అంగుళాల తాకే తెర, 480 X 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగా హెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌, 2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగా పిక్సెల్‌ రేర్‌ కెమేరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 512 ఎంబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 5.1 లాలిపాప్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 8 జీబీ స్టోరేజీ సామర్థ్యం, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3జీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

English summary

Lava Company Launched Lava Iris Atom 3 smartphone.The phone comes with a 5.00-inch touchscreen display with a resolution of 480 pixels by 854 pixels