రూ. 15,999కే విండోస్ 10 ల్యాప్ టాప్

Lava Twinpad 2-in-1 Laptop

04:51 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Lava Twinpad 2-in-1 Laptop

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ లావా సరికొత్త ల్యాప్ టాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ట్విన్‌ప్యాడ్ పేరిట ఈ 2 ఇన్ 1 హైబ్రిడ్ ల్యాప్‌టాప్ కమ్ ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. విండోస్ 10 ఓఎస్ తో పని చేసే ఈ ల్యాప్ టాప్ ధర రూ.15,999. ఈ డివైస్ రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని దీనిని లావా రూపొందించింది.

ట్విన్‌ప్యాడ్ ఫీచర్లు ఇవే..

10.1 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, బైడైరెక్షనల్ స్క్రీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డిటాచబుల్ కీబోర్డ్, స్టైల‌స్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ , 2 మెగాపిక్సల్ రియర్, ఫ్రంట్ కెమెరాలు, 7400 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, వైఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0, మైక్రో యూఎస్‌బీ స్లాట్

English summary

Lava Company launched a new windows Laptop called Lava Twinpad 2-in-1 Laptop.The price of this Laptop was Rs.15,999.This laptop comes with the key features like 10.10-inch display, 2-megapixel Front Camera,2-megapixel Front Camera,2GB RAM,Windows 10 Operating System.