లావా నుంచి మరో హై ఎండ్ స్మార్ట్ ఫోన్‌ 

Lava V5 Smartphone

11:37 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Lava V5 Smartphone

దేశీయ మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారు లావా తాజాగా ఓ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వి5 పేరిట రిలీజ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.11,499. ఈ ఫోన్ వినియోగదారులకు రిటెయిల్ స్టోర్స్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ లభిస్తోంది. మంచి కెమేరా కావాలనుకునేవారి కోసం లావా సంస్థ ఈ స్మార్ట్‌ ఫోన్‌ని మార్కెట్లోకి తెచ్చింది. 4జీ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ విడుదలవుతోంది.

వి5 ఫీచర్లు ఇవే..

5.5 అంగుళాల తాకే తెర, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 3జీబీ ర్యామ్‌, 13 మెగాపిక్సల్‌ కెమేరా, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం(అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో), 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌, 16జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 4జీ, గొరిల్లా గ్లాస్ 3,యూఎస్‌బీ ఓటీజీ సపోర్ట్

English summary

Lava company launched a new high end phone named Lava V5 Camera-Focused SmartPhone. The price of this smartphone was Rs. 11,499 and it comes with the key features like 4G,13 megapixel rear camera,8 megapixel front camera