అల్లు వారబ్బాయితో లావణ్య త్రిపాఠి పెళ్లి!

Lavanya Tripathi marriage with Allu Sirish

11:09 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Lavanya Tripathi marriage with Allu Sirish

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠి తన మొదటి చిత్రంలోనే తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాల్లో నటించి ఘనవిజయాలను సొంతం చేసుకుంది. ఆ తరువాత అక్కినేని నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో హీరోయిన్ గా నటించి మరింత పాపులర్ అయింది. ఆ తరువాత వచ్చిన లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం ఫ్లాప్ గా నిలిచినా లావణ్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి త్వరలోనే అల్లు వారబ్బాయిని పెళ్ళాడనుందట.

అదేంటి కెరీర్ మంచి పీక్స్ స్టేజిలో ఉండగా లావణ్య పెళ్ళి చేసుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. లావణ్య ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శతమానం భవతి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు అందరూ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ తన బంధువులందరి సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేస్తాడట..! అదండీ అసలు విషయం.

English summary

Lavanya Tripathi marriage with Allu Sirish