సందీప్‌ కిషన్‌ కొంపముంచిన 'లావణ్య'

Lavanya Tripathi rejected to act with Sundeep kishan

12:42 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Lavanya Tripathi rejected to act with Sundeep kishan

సందీప్‌కిషన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప' ఇది తమిళ సినిమా 'నేరమ్‌' అనే చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా ఇప్పటికీ నిత్యమీనన్‌ని ఎంపిక చేశారు. అయితే ఇందులో ఇంకో హీరోయిన్‌ అవసరం కాగా ఇదివరకే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని సంప్రదించగా ఆమె నో చెప్పింది. ఇప్పుడు తాజాగా లావణ్య త్రిపాఠిని సంప్రదించగా ఈ అమ్మడు డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని ఖాళీగా ఉన్న లావణ్య ఈ సినిమాకు ఎందుకు నో చెప్పిందోనని సినిమా జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

లావణ్య అంతగా ఆసక్తి చూపకపోవడానికి కారణం ఏంటంటే వరుసగా ఫ్లాఫులతో సతమతమవుతున్న సందీప్‌ కిషన్‌తో నటిస్తే తన కెరీర్‌కి ఏమైనా డ్యామేజ్‌ జరుగుతుందేమో అని ఈ అమ్మడికి భయమట. ఇదండీ అసలు సంగతి.

English summary

Lavanya Tripathi rejected to act with Sundeep kishan in Okka Ammayi Thappa movie.