లావణ్య త్రిపాఠి నటి కాకుంటే ఏమయ్యేదో తెలుసా?

Lavanya Tripathi Reveals Her Personal Information

11:45 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Lavanya Tripathi Reveals Her Personal Information

అవును చాలామంది హీరో హీరోయిన్లు ఏదో అవుదామని ఇలా ఇండస్ట్రీకి వచ్చేస్తారు. ఇక తొలి సినిమా ‘అందాల రాక్షసి’గా అలరించి ‘భలే భలే మగాడివోయ్ ’తో మురిపించి, ‘సోగ్గాడే చిన్ని నాయన’తో చక్కలిగింతలు పెట్టిన లావణ్య త్రిపాఠి ‘శ్రీరస్తు శుభమస్తు’ తాజా ఆచిత్రంలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. తన రూపలావణ్యాలతో మరోసారి అభిమానుల మతులు పోగొట్టడానికి సిద్ధమవుతున్న లావణ్య త్రిపాఠి ఏ విషయం అయినా తేలిగ్గా తీసుకుంటుంది. ఏ కారణం లేకుండా హాయిగా నవ్వుకోగలగడ మే నిజమైన సంతోషంగా చెప్పే లావణ్య రీల్ లైఫ్ లో ఎందరో హీరోలతో నటిస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ఇంకా ఎవరూ హీరోలు లేర ని చెబుతోంది. 'అలాంటి వ్యక్తి ఇంతవరకూ ఎదురు పడలేదు. ఎవరినైనా ఇష్టపడినా, పెళ్ళి చేసుకోవాలనుకున్నా అందరికీ చెప్పే చేసుకుంటా' అని అంటోంది.

ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ పాత్రలే కాదు ఎక్స్ పోజింగ్ కి సైతం సిద్ధపడాలి లేకుంటే ఇబ్బందే వస్తుంది. ఇదే విషయాన్ని లావణ్య దగ్గర ప్రస్తావిస్తే, 'ఎక్స్ పోజింగ్ కి అభ్యంతరం లేదని ఎప్పుడూ చెప్పను. కానీ గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి డ్రస్ లు వేసుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా అందాలు ప్రదర్శించడం నాకు ఇష్టం ఉండదు. అయినా మా ఫ్యామిలీ ఎప్పుడన్నా ఒకసారి నా సినిమాలు చూస్తారు. అలాంటి సమయంలో నేను ఎక్స్ పోజింగ్ చేసిన సన్నివేశాలు చూస్తే వెంటనే సినిమాలు మాన్పించేసి వెనక్కి తీసుకెళ్ళిపోతారు' అని చెప్పేసింది. ఇక హీరోయిన్ కాకపోయి ఉంటే ఈ అమ్మడు ఆర్కియాలజిస్టునై ఉండేదాన్ని అని చెబుతోంది. ఎందుకంటే ఆర్కియాలజీ అంటే ఈమెకు చాలా ఇష్టంఅట.

ఇది కూడా చూడండి: అక్కడ ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట..

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చూడండి: అమ్మాయిలు... ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

English summary

Lavanya Tripathi Reveals Her Personal Information.