అల్లు శిరీష్ ని బేవర్స్ ఎదవా అనేసింది

Lavanya Tripathi Shocking Comments On Allu Sirish

10:39 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Lavanya Tripathi Shocking Comments On Allu Sirish

అవునా, అల్లువారి అబ్బాయిని పట్టుకుని, హీరోయిన్ లావణ్య త్రిపాఠి చాలా దారుణంగా తిట్టేసింది. పోనీ ఎక్కడో పక్కన కాదు కోట్లాది మంది చూస్తుండగా అంతమాట అనేసింది. ఇంతకీ ఈమెకు కోపం వచ్చే పని అల్లు శిరీష్ ఏం చేసాడు? ఒక వేళ కోపం వస్తే మాత్రం అంత మాట అనేస్తుందా, దీనికి ఎంత పొగరు అంటూ శిరీష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. అయితే ఇలా తిట్టడానికి నిజంగా ఓ యాంకర్ కారణం. యాంకర్ అంటే అల్లా టప్పా యాంకర్ కాదండోయ్. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వంటి వాళ్ళు సైతం ఆమెకు ఫాన్స్. ఇంకెవరు సుమ ...

మరి లావణ్య ఇలా తిట్టడానికి యాంకర్ సుమ కారణం ఎలా అంటారా? అయితే వివరాల్లోకి వెళ్ళాలి. ఈటీవీలో శనివారం రాత్రి జీన్స్ ప్రోగ్రామ్ లో అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి పార్టిసిపేట్ చేశారు. ఇటీవల విడుదలైన శ్రీరస్తు - శుభమస్తు సినిమాలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈసినిమా మంచి టాక్ కూడా తెచ్చుకుంది. ఇక సుమ యాంకరింగ్ లో జీన్స్ లో పాల్గొన్న శిరీష్ , లావణ్య సరదాగా పలు విషయాలు మధ్య మధ్యలో చెప్పుకొచ్చారు. ఈలోగా లావణ్య చాలా దారుణంగా తిడుతుందండి బాబూ అంటూ శిరీష్ అనడం, శ్రీరస్తు - శుభమస్తు సినిమాలో ప్రతి సీన్ లో ఎలా తిట్టేదో కూడా చెప్పాడు. దీంతో సుమ కు ఛాన్స్ వచ్చేసింది. ఇదే సినిమా షూటింగ్ అనుకుని, ఓ సారి తిట్టు అంటూ, స్టార్ట్ అనడంతో 'మేడం గారూ' అని లావణ్యను సంబోధించడం, వెంటనే 'బేవర్స్ ఎదవా' అని లావణ్య తిట్టేయడం అయిపొయింది. దీంతో శిరీష్ హవ్వ అనడం కూడా అయింది. కోట్లాది మంది వీక్షకులు చూస్తుండగా, శిరీష్ ని లావణ్య తిట్టేసిందన్న మాట. అదండీ సంగతి. మరి ఇప్పుడు అభిమానులకు కోపం రాదుగా.

ఇది కూడా చూడండి: గతజన్మలో ప్రేమించిన వ్యక్తిని.. ఇప్పుడు కలిశామని చెప్పే సంకేతాలు!

ఇది కూడా చూడండి: మందుల చీటీపై డాక్టర్లు రాసే కోడ్స్ కి అర్ధం తెలుసా?

ఇది కూడా చూడండి: కళ్ళు-కనుబొమ్మలను బట్టి వక్తిత్వం చెప్పేయొచ్చా?

English summary

Lavanya Tripathi Shocking Comments On Allu Sirish.