పండక్కి ముందే 'సోగ్గాడే చిన్ని నాయనా'

Lavanya Tripati In Nagarjuna's MEK Show

11:04 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Lavanya Tripati In Nagarjuna's MEK Show

సంక్రాంతి ముందే నాగార్జున - లావణ్య త్రిపాఠి - రమ్య కృష్ణ నటించిన'సోగ్గాడే చిన్ని నాయనే ' చిత్రం సందడి చేసింది.వాస్తవానికి జనవరి 15న విడుదల కాబోతుంటే, ముందుగానే నాగ్ - త్రిపాఠి బుల్లి తెర మీద కనిపించి, ఈ చిత్రంలోని డైలాగులను ప్రస్తావిస్తూ, యమ ఖుషీ చేసేసారు. సొట్ట బుగ్గల త్రిపాఠి ను బ్యూటి అంటూ నాగ్ పొగిడేసాడు.

ఇంతకీ విషయమేమంటే , నాగ్ నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాల్టీ షోలో ఆదివారం రాత్రి కొద్దిసేపు ఈ సందడి కనిపించింది. షో మొదలవగానే త్రిపాఠి ఎంటర్ అయింది. డాన్స్ తో మొదలు పెట్టాలని నాగ్ అడగిందే తడవుగా, 'సోగ్గాడే చిన్ని నాయనే ' టైటిల్ సాంగ్ కి స్టెప్పు లేసింది. గేమ్ ఆడే కుర్చీలో కూర్చుని , ఈ చిత్రంలోని డైలాగులతో అలరించింది. మధ్యలో ఫోన్ కలపడంతో చెన్నైలో ఉన్న రమ్యకృష్ణ లైన్ లోకి వచ్చింది. అటు నుంచి కూడా డైలాగులు , నచ్చిన పాట ... ఇలా కబుర్లు సాగాయి. ఆతర్వాత శనివారం ఎపిసోడ్ కు కంటిన్యూ గా షో సాగింది. మొత్తానికి కొద్ది సేపు "సోగ్గాడే చిన్ని నాయనే" చేసిన సందడి ఈ సినిమా గమ్మున చూసేయ్యాలన్న ఉత్సుకత పెంచింది.

English summary

Heroine Lavanya tripati participated in Meelo Evaru Koteswarudu which was hosting by Akkineni Nagarjuna