చెన్నై వరద భాదితులకు లారెన్స్‌ కోటి విరాళం!!

Lawrence donated 1 crore rupees to Chennai flood victims

11:37 AM ON 4th December, 2015 By Mirchi Vilas

Lawrence donated 1 crore rupees to Chennai flood victims

20 రోజులు ఏకదాటిగా చెన్నైలో కురిసిన వర్షాలు తాకిడికి తమిళనాడులో ఉన్న 9 జిల్లాలు అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలు వల్ల తీవ్ర ఆస్తి నఫ్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపధ్యంలో తమిళ సినీ తారలు చెన్నై బాధితులకి భారీ విరాళాలు అందిస్తుంది. తాజాగా ఈ జాబితాలోకి కొరియోగ్రాఫర్‌ కమ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ లారెన్స్‌ కూడా చేరారు. ఏకంగా కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించి తన దయాహృదయాన్ని చాటుకున్నారు. ఎప్పడూ సామాజిక కార్యక్రమాల్లో ముందుండే లారెన్స్‌ కొద్ది రోజుల క్రితం అబ్దుల్‌కలాం జయంతి రోజున కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.

తాజాగా వరద భాదితులకి కోటి రూపాయలు ప్రకటించారు. చెన్నై నగరాన్ని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాని, చెన్నై మహా నగరం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాని లారెన్స్‌ ఈ సందర్భంగా చెప్పారు.

English summary

Lawrence donated 1 crore rupees to Chennai flood victims. He told Iam praying to God to recover Chennai very soon.