2 సెకన్లు.. 70 వేల ఫోన్లు

LE Company Sells 70 Thousand Phones In Just Two Seconds

10:59 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

LE Company Sells 70 Thousand Phones In Just Two Seconds

చైనాకు చెందిన ఎల్ఈ టీవీ భారత్ లో రికార్డు ఎంట్రీ ఇచ్చింది. ఎల్‌ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఎల్‌ఈ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. మొత్తం 6.05 లక్షల మంది ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకోగా, 2 సెకన్లలోనే 70 వేల ఎల్‌ఈ 1ఎస్ స్మార్ట్‌ఫోన్లను ఫ్లాష్‌సేల్‌లో అమ్మేసింది. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్స్ ఇదే అత్యధికంగా అమ్ముడవగా, తక్కువ వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడైన ఫోన్‌గా, అత్యధిక రిజిస్ట్రేషన్లు వచ్చిన డివైస్‌గా 1ఎస్ రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే మొదటి మిర్రర్-సర్ఫేస్ ఫింగర్ స్కానర్, 5.5 ఇంచ్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ 4జీ సిమ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ.11వేలు.

English summary

Chineese electronics company LE a new smartphone in India .Yesterday in flash sale 70,000 smartphones was selled in just two seconds in flipkart. The price of this smart phone was 11 thousand`