చైతూ 'ప్రేమమ్' సినిమాలో లీడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌!!

Lead Heroine fixed for Premam movie remake

04:39 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Lead Heroine fixed for Premam movie remake

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్' సినిమా రీమేక్‌ లో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో కథానాయిక గా నటించడానికి చాలామంది హీరోయిన్లను దర్శక నిర్మాతలు అనుకున్నారు. అయితే 'ప్రేమమ్' మలయాళ సినిమాలో నటించిన హీరోయిన్‌ 'మడోనా సెబాస్టియన్‌' నే ఈ తెలుగు వర్షన్‌ లో కూడా హీరోయిన్‌ అని ప్రకటించినట్లు సమాచారం. కాబట్టి మడోనా ఈ సినిమాలో నాగచైతన్యతో జతకట్టనుంది. ఇప్పటికే ఇద్దరు కథానాయికలు శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించనున్నారు అని స్పష్టం చేశారు.

'కార్తికేయ' ఫేమ్ చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఘాటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతుంది.

English summary

Lead Heroine fixed for Naga Chaitanya Premam movie remake in Majnu movie. Heroine who acted in a malayalam version is also acting in telugu version. She is Madonna Sebastian. Karthikeya fame Chandu Mondeti is directing this movie.