ప్రజలకు జవాబు దారీగా వుండాలి:చంద్రబాబు

Leaders should responsible for to answer the people

01:15 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Leaders should responsible for to answer the people

ప్రజలకు నాయకులు జవాబుదారీగా వుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. పార్టీని , ప్రజలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న రెండు రోజుల టిడిపి దిశానిర్దేశం కార్యక్రమంలో తొలిరోజు శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర విభానతో ఎపి ఎంతో నష్టపోయిందని ఆయన పేర్కొంటూ , 16 వేల కోట్ల లోటుతో రాష్ట్రాన్ని నడుపుతున్నామన్నారు. అందుకే ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించబోతున్నామని ఆయన చెబుతూ విభజన హామీల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులను ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకురావాలన్నారు. 2020 నాటికి దేశంలో మూడు అగ్ర రాష్ట్రాల్లో ఎపి ఒకటిగా వుండాలని , 2050నాటికి భారత్ లో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని , ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన వివరించారు.
సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు చెబుతూ , కరవు నివారణకు నీరు చెట్టు కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. నీరు - చెట్టు కార్యక్రమాలను కొనసాగించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. పట్టిసీమ ద్వారా కృష్ణా , గోదావరి నదుల అనుసంధానం ఆరున్నర నెలల్లోనే చేసామని ఆయన చెప్పారు. జూన్ నాటికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు నీరు అందిస్తామన్నారు. రెండేళ్లలో గాలేరు- నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రాయలసీమకు సాగు నీరందిస్తే, గోదావరి జిల్లాలకు పోటీగా పంటలు పండిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తికావడానికి ఐదేళ్ళు పడుతుందని , ఇప్పటికే తెలంగాణాలో ఉన్న పోలవరం ముంపు గ్రామాలను ఎపి పరిధిలోకి తెచ్చుకోగలిగామని ఆయన తెలిపారు.

English summary

Leaders should responsible for to answer the people.chandrababu naidu tells about responsibility to his political members