ఉత్తర కొరియా పౌరుల జీవనం దారుణం - రహస్య ఫొటోల్లో తేలిన నిజం

Leaked Photos Of LIfe In North Korea

02:37 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Leaked Photos Of LIfe In North Korea

ఉత్తర కొరియా మరోసారి అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది. అణు వార్ హెడ్ ను పరీక్షించింది. అమెరికా సహా అగ్రదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఆధునిక నియంతగా పేరు తెచ్చుకున్నాడు. దేశంలో ఏం జరగాలన్నా, ఏం జరిగినా కూడా ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. కిమ్ -2 సంగ్ మరణం తర్వాత అతడి కుమారుడు, కొరియా వర్కర్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కిమ్ జంగ్ ఉల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అమెరికాను ఢీకొట్టగల ఆయుధాలు, అణ్వస్త్రాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచాడు. ఒకపక్కన అత్యాధునిక ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న దేశంగా దక్షిణ కొరియా దూసుకుపోతుంటే దాని మీద శత్రుత్వంతో.. పాశ్చాత్య ప్రపంచంతో యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెప్పుకుంటున్న ఉత్తర కొరియా తమ దేశ పౌరుల్ని మాత్రం తీవ్ర పేదరికంలోనిక దుర్భర ఆంక్షల్లోకి నెట్టేస్తోంది. అయినా ఈ దేశానికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రాకుండా అధ్యక్షుడు జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. చివరకు ఇంటర్నెట్ పై కూడా ఆంక్షలు పెట్టేసాడు. ఇక్కడి ప్రజల జీవన విధానానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడం కష్టమే. అయితే ఓ ఫోటోగ్రాఫర్ అత్యంత రహస్యంగా ఫొటోలు తీసి ట్విటర్ , ఫేస్ బుక్ లలో పెట్టేసాడు. దీంతో అక్కడి జీవన పరిస్థితులు కొంత వెలుగులోకి వచ్చాయి. లండన్ కు చెందిన మైకేల్ హ్యూనివిక్జ్ అనే ఆ ఫొటోగ్రాఫర్ ఉత్తర కొరియా రాజధాని ప్యోంగాయంగ్ తీసిన ఈ చిత్రాలు ఇంటర్నెట్ లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

1/15 Pages

1. సగం మంది దారిద్య్రంలో ...

సగానికి సగం జనాభా దారిద్య్ర రేఖకు దిగువనే ఉంటారు. కనీస అవసరాలు కూడా వారికి దూరమే

English summary

North Korea country was known for its worst Regime and now some photos were leaked and that photos shows the life of the North Korean people and how they were suffering over there.