వావ్ ... సరికొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ స్మార్ట్ సైకిల్

LeEco Launched A New Smart Bicycle

10:58 AM ON 6th January, 2017 By Mirchi Vilas

LeEco Launched A New Smart Bicycle

ఇప్పుడు ప్రపంచమంతా సాంకేతికంగా దూసుకుపోతోంది. స్మార్ట్ ఫోన్లు అందరి చేతుల్లో హల్ చల్ చేస్తున్నాయి. స్మార్ట్ అనేది ఇప్పుడు సైకిళ్లను తాకింది. తాజాగా ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ లీ ఇకో సీఈఎస్ 2017 సందర్భంగా అమెరికా మార్కెట్లలో సరికొత్త స్మార్ట్ సైకిళ్లను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఆధారిత బైక్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ స్మార్ట్ సైకిళ్లు పరుగులు పెడతాయి. సైకిల్ ముందుండే టచ్ స్క్రీన్ డిస్ల్పే సైక్లిస్టులకు నావిగేషన్ ద్వారా లక్షిత ప్రదేశానికి ఏ దిశలో వెళ్లాలో, ఏ దారిలో వెళ్లాలో ముందుగానే సూచిస్తుందట. ట్రాక్ పెర్మార్మెన్స్ సైతం అందులో నిక్షిప్తమవుతుందట. ‘స్మార్ట్ రోడ్ బైక్’, ‘స్మార్ట్ మౌంటైన్ బైక్’ పేరిట లీ ఇకో రెండు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ రోడ్ బైక్... ఏరోడైనమిక్ టోరే టీ 700 కార్బన్ ఫైబర్ ఫ్రేమ్, ఫోర్క్, సీట్ పోస్టు, హ్యాండిల్ బార్, చక్రాలు మొత్తం కలిపి దాదాపు 8.35 కిలోల బరువుంటుంది. స్మార్ట్ మౌంటైన్ బైక్ లో కూడా అదే ఫ్రేమ్ తో ఉండి.. హ్యాండిల్ బార్ తో పాటు ఎస్ ఆర్ సుంటూర్ ఎక్స్ సీఆర్ ఎయర్ ఫ్రంట్ ఫోర్క్, 27.5 అంగుళాల వ్యాసంతో చక్రాలుంటాయి. మొత్తం కలిపి ఇది 12.2 కిలోల బరువు ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్ తో పనిచేసే 4 అంగుళాల టచ్ స్క్రీన్, 6000 ఎంఏహెచ్ రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీ, ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో మ్యూజిక్ వినే సదుపాయం వంటివి ఉన్నాయి. స్మార్ట్ బైక్ లపై రైడింగ్ కు వెళ్లిన వారు మాట్లాడుకునే విధంగా వాకీటాకీ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా వీటిలో పొందుపరిచారు. కంపానియన్ యాప్ ద్వారా మీ ప్రయాణ విశేషాలను రివ్యూ చేసుకోవడంతోపాటు ఇతరులకు కూడా షేర్ చేసుకోవచ్చు. జీపీఎస్ తో పాటు కంపాస్, యాక్సలరోమీటర్, బారోమీటర్, లైట్ లెవెల్, వీల్ స్పీడ్, క్రాక్ స్పీడ్ వంటి సెన్సార్లు కూడా ఉన్నట్టు లీ ఇకో ప్రకటించింది. హార్ట్ రేట్, పవర్ సెన్సార్ల ద్వారా మన ఫిట్ నెస్ కూడా పసిగట్టి సలహాలివ్వగలదు. ప్రయాణంలో ఫ్రంట్, సైడ్ లైట్లు వెలగడం, హార్న్, సేఫ్టీ సెక్యూరిటీ అలారం పనిచేయడం వంటి ఆటామేటిక్ ఫీచర్లు ఈ సైకిళ్లకు అదనపు ఆకర్షణ. ఎవరైనా స్మార్ట్ బైక్ దొంగిలించేందుకు ప్రయత్నిస్తే... సెక్యూరిటీ అలారం యాక్టివేట్ కావడంతో పాటు ట్రాక్ లొకేషన్ తో సహా మొబైల్ యాప్ ద్వారా యజమానికి ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికల్లా అమెరికా రోడ్లపై ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైకులు హల్ చల్ చేయనున్నాయి. అయితే ఇండియా మార్కెట్లోకి రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందేనని అంటున్నారు. ఇంతకీ ఇన్ని విశిష్టతలున్న స్మార్ట్ సైకిల్ ధర మాత్రం ఇంకా బహిరంగ పరచలేదు. ఇవి వస్తే, పెట్రోలు గొడవ ఉండదు. పర్యావరణ పరంగా కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: వాట్సప్ లో మీకు తెలీని కొన్ని ట్రిక్స్ ఇవే

ఇవి కూడా చదవండి: ‘గౌతమిపుత్ర’కి యూ/ఏ సర్టిఫికెట్ - ఇక రిలీజ్ పైనే దృష్టి

English summary

Chinese Mobile Company LeEco was become popular around the world by its products like Smart Phones,And Smart TV's and now LeEco has launched a new Android Operated Bicycle in US. This Smart cycle comes with Android 6.0 OS and 6000maH Huge battery and the features like GPS Navigating system etc.