నిమ్మకాయతో మొటిమలు మాయం

Lemon for acne removal

03:38 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Lemon for acne removal

మొటిమలు అనేవి దీర్ఘ కాలంగా ఉండే సాదారణ చర్మ వ్యాది. ప్రోపియోనిబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా కారణంగా చర్మ రంద్రాలు మూసుకుపోవటం వలన మొటిమలు ఏర్పడతాయి. సాదారణంగా మొటిమలు అనేవి 11 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సులో 80 శాతం మందికి వస్తూ ఉంటాయి. అయితే 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సులో కూడా మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొటిమలు ప్రమాదకరమైన చర్మ సమస్య కాదు. అయితే మొటిమలు వచ్చిన ప్రాంతంలో మచ్చలు ఏర్పడి కొంచెం అసహ్యంగా కనపడుతుంది.

మొటిమలకు సమర్థవంతంగా చికిత్స చేయటానికి అనేక సహజమైన పదార్దాలు ఉన్నాయి. అటువంటి పదార్దాలలో నిమ్మకాయ మన వంటింటిలో సులభంగా మరియు చౌకగా అందుబాటులో ఉంటుంది. మనం నిమ్మకాయతో మొటిమల కొరకు అద్భుతమైన సహజ నివారణలను తయారుచేసుకోవచ్చు.

1/10 Pages

నిమ్మకాయ మొటిమలకు నిజంగా చికిత్స చేస్తుందా?

నిమ్మకాయ నిజంగా మొటిమల చికిత్సలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. మనం అన్ని రకాల చర్మాల కోసం మరియు  మొటిమల చికిత్స కోసం నిమ్మలో ఉన్న లక్షణాల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలో ఉన్న ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం.

1. ఎక్స్ ఫ్లోట్

సిట్రస్ కుటుంబానికి చెందిన నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటుంది. ఇది మొటిమల ప్రభావిత చర్మం ఎక్స్ ఫ్లోట్ కావటానికి సహాయపడుతుంది. చర్మం యొక్క పొరలు ఊడి పోవటం అనేది మొటిమల చికిత్సలో ప్రధాన దశ. నిమ్మరసంను చర్మానికి రాస్తే చర్మ రంద్రాలకు అవరోదాలను తొలగించి దుమ్ము,మృత కణాలను తొలగిస్తుంది.

2. బ్యాక్టీరియాను చంపుతుంది

నిమ్మరసంలో సహజమైన యాంటీ బాక్టీరియల్ లక్షణం ఉంటుంది. అందువలన మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియాను చంపుతుంది. నిమ్మరసంలో ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ P సమృద్దిగా ఉండుట వలన మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియా వృద్ది చెందకుండా కూడా నిరోదిస్తుంది.

3. నయం చేసే లక్షణాలు

నిమ్మరసంలో నయం చేసే లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన, మోటిమలు కారణంగా వచ్చే వాపు మరియు ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

4. బ్లీచింగ్ ప్రభావం

నిమ్మరసంలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. అందువలన మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తగ్గిస్తుంది.

5. మొటిమలు తొందరగా తగ్గటానికి

నిమ్మరసంలో L- ఆస్కార్బిక్ ఆమ్లం ఉండుట వలన సహజమైన ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి మొటిమలు తొందరగా తగ్గటానికి నిమ్మరసం సహాయపడుతుంది.

6.  ఫ్రీ రాడికల్ మీద పోరాటం

నిమ్మకాయ రసంలో విటమిన్ C సమృద్దిగా ఉండుట వలన, అది యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసి  ఫ్రీ రాడికల్ మీద పోరాటం చేస్తుంది. ఈ  పోరాటం కారణంగా మొటిమలు తొందరగా విచ్చిన్నం అయ్యి త్వరగా తగ్గుతాయి. అంతేకాక  చర్మం దోషరహితం మరియు ఆరోగ్యకరముగా మారుతుంది. అలాగే ఇది బ్యాక్టీరియాతో పోరాటం చేయుట వలన చర్మం బలంగా తయారవుతుంది.

మొటిమల నివారణకు నిమ్మకాయను ఎలా ఉపయోగించాలి నిమ్మరసంతో తేనే,పెరుగు,రోజ్ వాటర్,గుడ్డు తెల్ల సోన ,నీరు మొదలైన పదార్దాలను కలిపి సులభమైన మరియు ప్రభావవంతమైన ఇంటి నివారణలను తయారుచేయవచ్చు. ఇప్పుడు ఆ ఇంటి నివారణల గురించి వివరంగా తెలుసుకుందాం.

English summary

There are many natural ingredients that are used to treat acne effectively. One such ingredient is lemon, which is not only cheap but also easily available at your home.