ఫుల్ మెటల్ బాడీతో లెనోవో కె5 నోట్

Lenovo K5 Note Smartphone

09:26 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Lenovo K5 Note  Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు లెనోవో తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కె సిరీస్ లో ఇటీవలే కె4 నోట్ రిలీజ్ చేసిన లెనోవో తాజాగా కె5 నోట్ ను సైతం మార్కెట్ లోకి తెచ్చింది. దీని ధర రూ.11,350. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లోనే లభిస్తోంది. త్వరలోనే ఇది ఇతర ప్రాంతాల్లోనూ లభ్యం కానుంది. అయితే ఎప్పుటి నుంచి లభ్యమవుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

లెనోవో కె5 నోట్ ఫీచర్లు ఇవే..

1.8 జీహెచ్‌జడ్ 64 బిట్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, మాలి టి860 జీపీయూ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, ఫుల్ మెటల్ బాడీ, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 4.0, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డిజిటల్ కంపాస్

English summary

Worlds famous Electronics company Lenovo launched a new smartphone called Lenovo K5 Note With 5.5-Inch Display, Metal Body. The price of this smartphone was approximately approximately Rs. 11,350