లెనోవో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్

Lenovo Launched A7010 Smart Phone

04:24 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Lenovo Launched A7010 Smart Phone

చైనా దిగ్గజ సంస్థ లెనోవో తన ‘ఎ’ సిరీస్ లో మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. లెనోవో ఎ7010 పేరిట నూతన స్మార్ట్ ఫోన్ ను రొమానియన్ వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. ఇందులో ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను వెల్లడించిన లెనోవో ధర ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది అనే విషయాలను వెల్లడించలేదు.

వెబ్ సైట్ లో వెల్లడించిన ప్రకారం.. లెనోవో ఎ7010 డ్యూయల్ సిమ్ మొబైల్. ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1తో వస్తుంది. 5.5 ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే (1080*1920 పిక్సల్) 2జీబీ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 13 మెగా పిక్సల్ కెమెరా విత్ ఆటో ఫోకస్.. డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్.. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 8జీబీ ఇంటర్నల్ మెమరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 4జీని కూడా సపోర్ట్ చేస్తుంది. 3300 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ 23 గంటల టాక్ టైమ్ అందిస్తోంది. 265 గంటల స్టాండ్ బై టైమ్ ఉంటుంది. గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆంబియంట్ లైట్ సెన్సార్, మొదలైన ఫిచర్లు కూడా ఉన్నాయి. 9 ఎంఎం మాత్రమే ఉన్న ఈ ఫోన్ 160 గ్రాముల బరువు ఉంది.

English summary

Lenovo electronics company launched its new smart phone named lenovo A7010 . Lenovo company still not announced this phone officially