జనవరిలో మార్కెట్ లోకి లెనోవో కిల్లర్ నోట్?

Lenovo Launching K4 Note in January

02:54 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Lenovo Launching K4 Note in January

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లెనోవో తన కొత్త మొబైల్ ను జనవరి 5న మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది జూన్ లో విడుదల చేసిన లెనోవో కే 3 నోట్ ప్లేస్ లో ఈ కొత్త ఫోన్ ను తీసుకొస్తోంది. ఇప్పటికే కిల్లర్ నోట్ పేరుతో ఈ ఫోన్ టీజర్ ను విడుదల చేసింది. దీనికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కే 4 నోట్ కు సంబంధించి ఒక్కో ఫీచర్ ను రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తోంది. ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్‌తో విడుదల కానుందని కంపెనీ ఓ టీజర్‌ ఫొటోను తన సైట్ లో వెల్లడించింది. ఈ ఫొటో సోషల్‌మీడియాలో షికార్లు కొడుతోంది. కే4 నోట్‌లో మెటల్‌ బాడీ, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇవి కే3 నోట్‌లో లేవు. అయితే దీని ధర మిగిలిన ఫీచర్లు, ధర గురించి లెనోవో వెల్లడించలేదు.

English summary

One of the leading top Mobile company Lenovo launching its new model K4 Note in january for india with awesome features.