మార్కెట్ లోకి 'థింక్‌ప్యాడ్' ల్యాప్‌టాప్‌లు..

Lenovo Thinkpad Laptops

04:28 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Lenovo Thinkpad Laptops

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పుత్తుల సంస్థ లెనోవో కొత్త ల్యాప్‌టాప్‌లను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 'థింక్‌ప్యాడ్' సిరీస్‌లో రిలీజ్ చేయనున్న ఈ ల్యాప్ టాప్ లు జనవరి 2వ వారంలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 'థింక్‌ప్యాడ్ పి40 యోగా', 'థింక్‌ప్యాడ్ పి50ఎస్' పేరిట ఈ కొత్త ల్యాప్‌టాప్‌లను, 'థింక్‌స్టేషన్ పి310' పేరిట డెస్క్‌టాప్ పీసీని విడుదల చేయనుంది.

థింక్‌ప్యాడ్ పి40 యోగా ఫీచర్లు ఇవే..

2560X1440 పిక్సల్స్ క్యూహెచ్‌డీ టచ్‌స్క్రీన్ రిజల్యూషన్ డిస్‌ప్లే, రొటేటింగ్ మోడ్స్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, 6వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 సీపీయూ, 16 జీబీ డీడీఆర్3 ర్యామ్, 2 జీబీ ఎన్‌వీడియా గ్రాఫిక్స్ మెమోరీ, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.93,200.

థింక్‌ప్యాడ్ పి50ఎస్ ఫీచర్లు ఏమిటంటే..

15.6 ఇంచ్ 3కె ఐపీఎస్ డిస్‌ప్లే, 1620X3880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 6వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 సీపీయూ, 32 జీబీ ర్యామ్, 17 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ.86,500.

థింక్‌స్టేషన్ పి310 ఫీచర్లు

ఈ డెస్క్‌టాప్ పీసీలో ఇంటెల్ కోర్ జియాన్ ప్రాసెసర్, 64 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ చేసే మదర్‌బోర్డ్, 1394 ఫైర్‌వైర్ పోర్ట్, యూఎస్‌బీ 3.0 స్లాట్స్, రెండు గ్రాఫిక్ కార్డులను అమర్చుకునే స్లాట్స్, 2 ఎస్‌ఎస్‌డీ స్లాట్స్ ఉన్నాయి. ధర రూ.48,500.

English summary

Famous electronic company lenovo launches its new laptops in its thinkpad series. The two laptops named "Thinkpad P40 Yoga,Thinkpad P50S" these laptops were to be available in india in january 2016