లెనోవో.. కిల్లర్ నోట్ ఆయేగా..

Lenovo Vibe K4 Note Launched

06:42 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Lenovo Vibe K4 Note Launched

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో.. వైబ్‌ కే4 నోట్‌ పేరుతో కొత్త ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 11,999. ఫుల్ మెటల్ బాడీతో ఈ ఫొన్ ను రూపొందించింది. భారత్‌లో అద్భుత విజయం సాధించిన కే3 నోట్‌కి కొనసాగింపుగా దీన్ని మార్కెట్లోకి తెచ్చింది. అమెజాన్‌ ఇండియాలో ఈ ఫోన్‌ కొనుగోలుదారుల ఫ్లాష్ సేల్ లో కొనుగోలు చేయవచ్చు. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టం, 13 మెగాపిక్సల్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ కెమెరా, 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 16జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో మెమొరీని 128జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, 3జీబీ ర్యామ్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, డాల్బీ అట్మాస్ ఆడియో, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ ఫ్రంట్ స్పీకర్లు మొదలైన అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఫోన్ తోపాటు యాంట్ వీఆర్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను బండిల్‌గా అందిస్తున్నారు. రూ.12,499 చెల్లిస్తే స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఈ హెడ్‌సెట్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 19న మొదటి ఫ్లాష్ సేల్ జరగనుంది.

English summary

Lenovo has launched the Vibe K4 Note, successor to the popular K3 Note smartphone.The Price of this phone is of Rs. 11,999, the Lenovo Vibe K4 Note will be available exclusively from Amazon India in its first flash sale on January 19