15న లెనోవో వైబ్ కె5 ప్లస్ స్మార్ట్‌ఫోన్

Lenovo Vibe K5 Plus To Launch On March 15

04:21 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Lenovo Vibe K5 Plus To Launch On March 15

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. లెనోవో వైబ్ కె5 ప్లస్‌ పేరిట ఈ ఫోన్ ను ఈ నెల 15న భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో ప్రదర్శించింది. ఇప్పుడు దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే దీని ధర వివరాలను వెల్లడించలేదు.

వైబ్ కె5 ప్లస్ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 2 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

English summary

Chinese Popular Electronics company Lenovo to launch a new smartphonce called Lenovo Vibe K5 plus on March 15th.This smartphone comes with the key features like 2GB RAM,2750mAh Battery,5-inch Full HD display,13-megapixel rear camera with LED flash,5MP front camera.