లెనోవో నుంచి వైబ్‌ ఎక్స్‌ 3

Lenovo Vibe X3 Smartphone

11:45 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Lenovo Vibe X3 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లెనోవో రోజుకో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. తాజాగా సరికొత్త మోడల్‌ వైబ్‌ ఎక్స్‌ 3ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవలే ఈ ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయగా.. బుధవారం భారత్‌లో రిలీజ్ చేసింది. దీని ధర రూ. 19,999. ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమేజాన్‌లో ఈ ఫోన్లు అమ్మకానికి పెట్టింది.

లెనోవో వైబ్ ఎక్స్ 3 ఫీచర్లు ఇవే..

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్స్, 4జీ ఎల్‌టీఈ, 3జీబీ రామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 21 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, హెగ్జాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 418 అడ్రినో జీపీయూ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ ఓటీజీ

English summary

Lenovo company launched a new smartphone in its Vibe Series named Vibe X3 smartphone. The price of this smartphone was Rs. 19,999 and it comes with the key features like 5.5-inch IPS display,Corning Gorilla Glass,4G,3GB of DDR3 RAM,32GB inbuilt storage,21-megapixel rear camera,hexa-core Qualcomm Snapdragon 808 processor