లెనోవో నుంచి యోగా ట్యాబ్‌ 3ప్రో

Lenovo Yoga Tab 3 Pro Tablet

10:00 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Lenovo Yoga Tab 3 Pro Tablet

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో మరో సరికొత్త ట్యాబ్లెట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. యోగా సిరీస్ లో యోగా ట్యాబ్‌ 3ప్రోను ఇండియాలో విడుదల చేసింది. గత ఏడాది బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏ ఎగ్జిబిషన్‌లో దీనిని ప్రదర్శించింది. దీని ధర రూ. 39,990. ట్యాబ్‌ 3ప్రో కేవలం క్రోమా అవుట్‌లెట్‌లలోను, ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్‌ 5.1 ఓఎస్‌తో పని చేసే ఈ ట్యాబ్‌ లో ప్రొజెక్టర్‌ సదుపాయం ఉంది. దీని ద్వారా 180 డిగ్రీల కోణంలో 70 అంగుళాల తెరపై వీడియోలను ప్రదర్శించవచ్చు.

యోగా ట్యాబ్‌ 3 ప్రో ఫీచర్లు ఇవే..

10.1 అంగుళాల ఫుల్ హెచ్ డీ తాకే తెర, ఇంటెల్‌ ఆటమ్‌ క్వాడ్‌ కోర్‌ 2.24 జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, 13 ఎంపీ వెనుక కెమెరా, 2560*1600 స్క్రీన్‌ రిజల్యూషన్‌, 2 జీబీ ర్యామ్‌, 32 అంతర్గత మెమొరీ, 128 జీబీ మెమొరీ కార్డుకు అవకాశం, 10200 ఎంఏహెచ్‌ బ్యాటరీ

English summary

Popular Chineese Electronics company Lenovo launched a new tablet named Yoga Tab 3 Pro.The price of this tab would be Rs. 39,990.It comes with the key features like 10.10-inch Display,2.24GHz Processor, 2GB RAM,13-megapixel Rear Camera, 5-megapixel Front Camera,16GB internal Storage