వరల్డ్స్ స్లిమ్మెస్ట్ ల్యాప్ టాప్ యోగా 900ఎస్

Lenovo's new Yoga 900S Laptop

05:20 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Lenovo's new Yoga 900S Laptop

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో సరికొత్త ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అతి పలుచని(12.8 మిల్లీమీటర్లు) కన్వర్టబుల్ ల్యాప్ టాప్ ఇదే కావడం గమనార్హం. కంపెనీ తన యోగా సిరీస్ లో యోగా 900 ఎస్ పేరిట ఈ కొత్త ల్యాప్ టాప్ ను రూపొందించింది. యోగా 900ఎస్ లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, అతి తక్కువ బరువు (999 గ్రాములు), 10.5 గంటల వీడియో ప్లేబ్యాక్, డాల్బీ ఆడియోను అందించే ఇంటెల్ కోర్ ఎం7 ప్రాసెసర్, క్రిస్టల్ క్లియర్ రిజల్యూషన్‌ను అందించే క్యూహెచ్‌డీ స్క్రీన్ (2,560x1,440 రిజల్యూషన్) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితోపాటు లెనొవొ కంపెనీ ఐడియాప్యాడ్ వై900, ఐడియా సెంటర్ వై900 ఆర్‌ఈ, లెనొవొ వై27జీ అండ్ వై27జీ ఆర్‌ఈ కర్వ్‌డ్ గేమింగ్ మానిటర్స్, ఐడియాసెంటర్ 610ఎస్, ఐడియాప్యాడ్ 700, 710ఎస్ వంటి తదితర ఉత్పత్తులను మార్కెట్‌లో ఆవిష్కరించింది. త్వరలో లాస్‌ఏంజిలిస్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో వీటిని ప్రదర్శించనున్నది.

English summary

China Electronics Company Lenovo launches a new laptop named Yoga 900S with windows 10 operating system.It weighs only 999 grams.The width of this laptop was only 12.8 millimeters. This was the slimmest laptop ever in the world upto now