మరోసారి శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య

Lepakshi Utsavalu 2016 Details

10:42 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Lepakshi Utsavalu 2016 Details

విజయనగర సామ్రాజ్యం.. కళాపోషణకు పుట్టినిల్లు... అష్ట దిగ్గజ కవులు ... అంగళ్ళ రత్నాలు అమ్మిన కాలం ... అదే శ్రీకృష్ణ దేవరాయాల పాలన ... రాయలేలిన సీమ రతనాల సీమ అంటారు అందుకే ... అలాంటి శ్రీకృష్ణ దేవరాయల పాత్రాలో అలనాడు ఎన్టిఆర్ ఒదిగిపోయారు. ఇక యువరత్న బాలకృష్ణ కూడా ఆదిత్య 369 సినిమాలో రాయల వారి పాత్రతో  భళీ అన్పించాడు. ఇప్పుడు మరోసారి రాయల పాత్రతో అలరించబోతున్నాడు. అయితే ఈసారి సినిమాలో కాదు ... వేదిక మీద ... అది కూడా రాయలసీమ లోనే ... అనంతపురం జిల్లా లేపాక్షిలో ... వివరాల్లోకి వెళితే, 

   తెలుగుజాతి కీర్తిని నలుదిశాలా వ్యాపింపజేసేలా.. రాష్ట్ర పండగను తలపించేలా ఫిబ్రవరి 27, 28 తేదీలలో రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా పూర్తిచేసారు. పలువురు ప్రముఖులు , సినీ కళాకారులు , రంగస్థల కళాకారులు , నృత్య కళాకారులు ... ఇలా ఎందరో పాల్గొంటున్నారు. వేడుకలకు వచ్చే ప్రముఖులు, లక్షలాది మంది పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా  హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

   అలనాటి రాయల వారి  పాలనకు గుర్తుగా ఉన్న లేపాక్షి మరోసారి సాంస్కృతిక మహా ఉత్సవానికి నెలవుగా మారనుంది. తెలుగు భాష.. సంస్కృతికి ప్రతిబింబంగా.. సాహితీ సుగంధాల మేళవింపుగా.. గత చరిత్ర తాలూకు దర్పాన్ని మరోసారి ప్రదర్శించటానికి సిద్ధమైంది. ఈ సంబరానికి వేదికైన లేపాక్షి ఆలయం.. పరిసర ప్రాంతాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. పండగ వాతావరణంలో మహత్కార్యాన్ని నిర్వహించటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. స్థానిక సంస్కృతిని దశ దిశలా చాటే కార్యక్రమాలతోపాటు.. తెలుగు జాతి సంస్కృతికి చిహ్నంగా ఉన్న కూచిపూడి, భరత నాట్యం.. సినీతారల తళుకు బెళుకులతో లేపాక్షి కనులవిందు చేయటానికి సిద్ధమైంది. ఇక బందోబస్తు కోసం  20 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలు, 1600 మంది వరకు పోలీస్‌ సిబ్బందిని నియమించారు

  ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. పలువురు ప్రముఖులు తరలిరానున్నారు. కార్యక్రమానికి యాంకర్ గా  సుమ వ్యవహరిస్తుంది. ప్రఖ్యాత డ్రమ్స్‌ వాద్యకారుడు శివమణి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంటే, . ప్రముఖ సినీ నటి శోభన నృత్యం అలరించనుంది.  ఇక రెండవరోజు ఆదివారం రా.7.45 నుంచి 8.15 వరకు శ్రీకృష్ణదేవరాయ వేషధారణలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినయంతో అలరించబోతున్నాడు. గతంలో అమెరికా తెలుగు సభల్లో కూడా బాలయ్య శ్రీ కృష్ణ దేవరాయల పాత్రతో అలరించాడు. ఇప్పడు మరోసారి రాయల వారి పాత్ర ను ఎంచుకున్నాడు. 

బాలకృష్ణ ఇంతకు ముందు కుడా కొన్ని పౌరాణిక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.వాటిలో ఇప్పుడు కొన్ని..

1/8 Pages

శ్రీరామ రాజ్యం

English summary