రెండు రోజుల లేపాక్షి వైభవం

Lepakshi Utsavam Highlights

09:49 AM ON 2nd March, 2016 By Mirchi Vilas

Lepakshi Utsavam Highlights

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది అప్పుడే డబుల్ ధమాకా సృష్టించాడు. ఈ సంక్రాంతికి విడుదలైన డిక్టేటర్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో నటుడిగా యమ ఖుషీగా వున్నాడు బాలయ్య . ఇక రాయలసీమ లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎంఎల్ఎ గా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలయ్య , అన్నీ తానై లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించి, భళీ అనిపించుకున్నాడు. సిఎమ్ చంద్రబాబు , కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు , మంత్రులు పల్లె రఘునాద్ రెడ్డి , పరిటాల సునీత తదితరులు హాజరయిన ఈ వేడుకల్లో పలువురు సినీ కళాకారులు , వివిధ కళారూపాల కళాకారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో నిర్వహణలో తన సమర్ధత చాటుకున్నాడు. అంతేకాదు, ఆటా పాటా లో కూడా భాగం పంచుకున్నాడు. ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం ....

1/12 Pages

గ్రామోత్సవం ...

ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించిన గ్రామోత్సవం లో రాజ ఠీవి తో వెలిగిపోయాడు బాలయ్య. సింహాసనం పోలిన కుర్చీలో కూర్చుని శోభాయాత్ర కు వన్నె తెచ్చాడు.

English summary