ఎల్ఈటీవీ నుంచి మాక్స్ ప్రో

LeTV Launched Max Pro Smartphone

04:10 PM ON 11th January, 2016 By Mirchi Vilas

LeTV Launched Max Pro Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఎల్ఈటీవీ మాక్స్ ప్రో ఫ్యాబ్లెట్ ను ఆవిష్కరించింది. ఎల్ఈటీవీ చైనాలో లైవ్ స్ట్రీమింగ్, క్లౌడ్, ఈకామర్స్, స్మార్ట్ టీవీ మొదలైన సర్వీసులు అందిస్తోంది. తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎల్ఈటీవీ మాక్స్ ప్రోను సీఈఎస్-2016లో ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ఎస్వోసీతో వస్తున్న మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ చెపుతోంది. దీని ధరను సుమారు రూ. 35,500గా నిర్ణయించినట్టు సమాచారం. 6.33 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 1440*2560 పిక్సల్ రిజల్యూషన్, 2.2 గిగా హెడ్జ్ ప్రాసెసర్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ఎస్ వోసీ, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 21 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 4 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్, ఎల్ టీఈ 4జీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ వేరియంట్లలో లభ్యంకానుంది. క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 2.0 సదుపాయం కూడా ఉంది. దీనితో 0 నుంచి 60 శాతం వరకు బ్యాటరీ 30 నిమిషాల్లోనే ఎక్కుతుంది.ఇంకా ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ సెన్స్ ఐడీ, ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్ టెక్నాలజీ మొదలైన అదనపు ఫీచర్లు ఉన్నాయి.

English summary

China's Popular live streaming company LeTV brand launched a new smart phone called Max Pro. This phones comes with the features like Snapdragon 820 processor,6.33-inch display,4GB of RAM,1-megapixel ,4G etc