భారత్‌లోకి ఎల్‌ఈటీవీ ఫోన్లు

Letv Smart Phones Launched in India

04:40 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Letv Smart Phones Launched in India

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్‌ఈటీవీ భారత్‌లో రెండు ఫోన్లను విడుదల చేసింది. లి మ్యాక్స్‌ ఫ్యాబ్లెట్‌, లివన్స్‌ స్మార్ట్‌ ఫోన్‌. వీటిని ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి కోసం బుధవారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. కాగా, లీ మాక్స్ రెండు వేరియంట్లో లభ్యమవుతోంది. 64జీబీ మెమొరీ గల వేరియంట్‌ ధర రూ.32,999కాగా, 128జీబీ మెమొరీ గల వేరియంట్‌ ధర రూ.69,999. ఇవి బంగారు, వెండి రంగుల్లో ఫోన్‌ లభ్యం కానున్నాయి. ఇక లివన్స్‌ ఫోన్‌ ధర రూ.10,999.

లి మ్యాక్స్‌ ఫీచర్ల ఇవే..

6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ తాకే తెర, 1440×2560 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 2గిగాహెడ్జ్‌ ఓక్టాకోర్‌ ప్రాసెసర్‌, 21 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 4 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం

లివన్స్‌ ఫోన్‌ ఫీచర్లు ఇవే..

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ తాకే తెర, 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 3జీబీ ర్యామ్‌, 32జీబీ అంతర్గత మెమొరీ, 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 3జీ, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

Chineese mobile company Letv launched smart phones named Le Max and Le 1s in India.