ఎల్‌జీ నుంచి జీ5 స్మార్ట్ ఫోన్

LG G5 Smartphone

07:04 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

LG G5 Smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ఎల్‌జీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. జీ5 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఆవిష్కరించింది. అయితే దీని ధర.. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది అనే వివరాలను వెల్లడించలేదు. దీనితో పాటు క్యామ్ ప్లస్, హైఫై ప్లస్ విత్ బీ అండ్ ఓ ప్లే పేరిట రెండు మాడ్యూల్స్‌ను ఎల్ జీ అందిస్తోంది. క్యామ్ ప్లస్ ద్వారా డీఎస్‌ఎల్‌ఆర్ స్థాయిలో ఫొటోలను తీసుకోవచ్చు. హైఫై ప్లస్ విత్ బీ అండ్ ఓ ప్లే మాడ్యూల్ ద్వారా నాణ్యమైన హైడెఫినిషన్ ఆడియోను పొందే వీలుంది. వీటితో పాటు ఎల్‌జీ 360 క్యామ్ పేరిట ఓ 360 డిగ్రీ యాంగిల్ కెమెరాను, ఎల్‌జీ 360 వీఆర్ పేరిట ఓ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను కూడా రిలీజ్ చేసింది. వీటి ధరలను కూడా త్వరలో ప్రకటించనుంది.

ఎల్‌జీ జీ5 ఫీచర్లు ఇవే..

5.3 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440x2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్-సి, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.2, వైఫై 802.11 ఏసీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

English summary

LG Launched a new smartphone named LG G5. This smartphone comes with the key features like 5.30-inch display,8-megapixel front camera, 4GB RAM,16-megapixel rear camera,32GB Internal camera.