ఎల్ జీ నుంచి కె10, కె7

LG K10, K7 SmartPhones Launched

06:44 PM ON 5th January, 2016 By Mirchi Vilas

LG K10, K7 SmartPhones Launched

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్‌జీ కే సిరీస్‌ ఫోన్‌లను విడుదల చెయనుంది. అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో మంగళవారం నుంచి సీఈఎస్‌ 2016 పేరుతో టెక్నాలజీ షో జరగబోతోంది. దీంతో ప్రముఖ సంస్థలన్నీ తమ కొత్త ఉత్పత్తుల్ని అక్కడ ప్రదర్శించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎల్‌జీ కూడా ఎల్‌ సిరీస్‌ తర్వాత ఇప్పుడు కే10, కే7 పేర్లతో తొలి కే సిరీస్‌ ఫోన్లను విడుదల చేస్తోంది. అయితే హైఎండ్‌ ఫోన్లయిన వీటి ధరల్ని, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న వివరాల్ని సంస్థ వెల్లడించలేదు.

కె10 స్పెషాలిటీలు ఇవీ..

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 3జీ సపోర్ట్‌, 8 జీబీ అంతర్గత మెమొరీతో ఒకటి, 4జీ ఎల్‌ఈటీ సపోర్ట్‌, 16 జీబీ అంతర్గత మెమొరీతో రెండోది అందించనుంది. 5.3 అంగుళాల తాకే తెర, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టం, 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 2300ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8మెగాపిక్సల్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

కె7 ప్రత్యేకతలు ఇవీ..

ఇందులో కూడా రెండు వేరియంట్లు ఉన్నాయి. 3జీ సపోర్ట్‌, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్‌ ప్రాసెసర్‌, 8 జీబీ అంతర్గత మెమొరీతో ఒకటి, 4జీ ఎల్‌ఈటీ సపోర్ట్‌, 1.1 గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్‌ ప్రాసెసర్‌, 16 జీబీ అంతర్గత మెమొరీతో మరోటి లభ్యంకానున్నాయి. 5 అంగుళాల డిస్‌ప్లే, 854×480 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 2125 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

English summary

LG has announced its first K-Series smartphones, the LG K10 and LG K7. The company claims the new series succeeds its L-Series.