పేపర్ లా చుట్టేయొచ్చు..

LG Rollable Oled Display

05:56 PM ON 6th January, 2016 By Mirchi Vilas

LG Rollable Oled Display

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్జీ రోల్ చేయగలిగే 18 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ను ఆవిష్కరించింది. దీనిని పేపర్‌ను చుట్టినట్టుగా చుట్టేయొచ్చు. అమెరికాలో జరుగుతున్న సీఈఎస్‌-2016 షో కోసం ఎల్‌జీ ఈ రకం 18 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలో ఇదే మొదటి బెండబుల్‌ డిస్‌ప్లే అని సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి డిస్‌ప్లేలదే రాజ్యం కాబోతోందని వెల్లడించింది. టెక్నాలజీ షోలో ఈ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ప్రదర్శనకు ఉంచింది. దీంతో పాటు రెండు వైపులా వీడియో ఇమేజెస్‌ ప్రదర్శించగలిగే అత్యంత పలుచని 55 నుంచి 85 అంగుళాల డబుల్‌ సైడెడ్‌ డిస్‌ప్లేను కూడా సంస్థ ప్రదర్శనకు ఉంచింది. అలాగే హై డైనమిక్‌ రిజల్యూషన్‌ 65 అంగుళాలు, 77 అంగుళాల తెర కలిగిన ఓఎల్‌ఈడీ టీవీ ప్యానల్స్‌ను కూడా ఎల్‌జీ విడుదల చేసింది.

English summary

LG will show off its flexible Oled display that rolls up like newspaper along with its latest 4K ultra HDTVs in both Oled and LCD flavours at CES 2016 in Las Vegas.