వైఫై ను మించి పోయే లైఫై  

Li-fi Which Is Better Than Wi-fi

04:15 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Li-fi Which Is Better Than Wi-fi

స్మార్ట్ ఫోన్ వున్నా ప్రతి ఒక్కరికి సుపరిచితం ఐన పేరు వైఫై. ఎక్కడైనా ఫ్రీ వైఫై ఉందంటే చాలు అక్కడ వాలిపోతారు. కాని ఇప్పుడు వైఫై కూడా అవుట్ డేటెడ్ అయిపోతుంది అనే చెప్పాలి.

వైఫై గొప్పది అయినప్పటికీ 5G నెట్ వర్క్ తో పోల్చి చేసిన పరీక్షల్లో వైఫై వెనకబడిపోయింది. వైఫై కి ప్రత్యన్నామం గా మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది అది లైఫై.
వైఫై రేడియో తరంగాల తో పోల్చుకుంటే లైఫై అతి తక్కువ కాంతి ని ఉపయోగించి వేగంగా డాటాను విడుదల చేస్తుంది. వైఫై తో పోలిస్తే లైఫై 100 రెట్లు వేగంగా పని చెయ్యడమే కాక మరింత భద్రతను కల్పిస్తుంది.

లైఫై డేటా ట్రాన్స్ ఫర్ యోక్క బ్యాండ్ విడ్త్ ను 100 రెట్లు ఎక్కువగా పెంచుతుంది . ద్వారా మనం 1.5జీబి ఉన్న 18 సినిమాలను కేవలం ఒక్క సెకండ్ వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు . సైంటిస్ట్ లు లైఫై మీద చేసిన పరీక్షలో లైఫై ఏకంగా 224 గిగ్ బిట్స్ ను ఒక సెకనుకు విడుదల చేసింది. వాస్తవ ప్రపంచంలో లైఫై ఒక సెకనుకు 1జీబి డేటా ను విడుదల చెయ్య గలిగింది.

లైఫై ను మొదటి సారిగా 2011 వ సంవత్సరంలో ఎడిన్ బుర్ఘ్ యూనివర్సిటీ వారు కనుగొన్నారు. వైఫై తో పోలిస్తే లైఫై గోడలు లో నుండి ప్రసురించలేదు. కాని లైఫై వల్ల ఎక్కువ భద్రత ఉన్నందు వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు లైఫై ని తమ తమ ఆఫీసుల్లో అమర్చుకోవడానికి యత్నిస్తున్నారు. లైఫై ను ఇప్పటికే ఫ్రెంచ్ కంపెనీ ఒలేడ్ కమ్ వారు తన సొంత లైఫై టెక్నాలజీ ను అమర్చుకుంటున్నారు.

English summary

A new technology called Li-fi which was invented by scientists which was 100 times faster than Wi-fi. Wi-fi transmits data in the form of radiowaves but Li-fi uses light to transmit data. Li-fi was implementing in various companies because of its high speed and high security