ఆన్ లైన్ లో ఎల్‌ఐసీ వివరాలు

LIC Details To Get Online

10:27 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

LIC Details To Get Online

మీరు లైఫ్ ఇన్సూరన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో బీమా చేస్తున్నారా.. అయితే ఇది మీకు శుభవార్తే. ఎల్‌ఐసీ తన ఖాతాదారుల సౌలభ్యం కోసం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎస్‌కే రాయ్‌ విలేకరులకు తెలిపారు. కొత్త సౌకర్యం ద్వారా వినియోగదారులకు కలిగే సౌకర్యాల్ని వివరించారు. ఖాతాదారు తమ ఎల్‌ఐసీ పాలసీ వివరాలు.. చెల్లించాల్సిన ప్రీమియం తదితర వివరాల్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. పాలసీల స్టేటస్‌, బోనస్‌, లోన్‌లు తదితరాల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం పొందవచ్చు. ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌ ద్వారా పాలసీకి సంబంధించిన ప్రీమియం చెల్లించవచ్చు. ఇంకా పాలసీ సెటిల్మెంట్‌ స్టేటస్‌ని చూసుకోవచ్చు. ఇంతేకాక కొత్త పాలసీని ఆన్‌లైన్‌ ద్వారానే నేరుగా కొనుక్కోవచ్చు.

English summary

India's largest insurer Life Insurance Corporation of India (LIC) launched its own insurance repository LIC E-services on Monday.