శశిథరూర్ కు లై డిటెక్టర్ పరీక్ష?

Lie Detecter Test To Shashi Tharoor

07:15 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Lie Detecter Test To Shashi Tharoor

సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సునంద భర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొవలసి వచ్చే అవకాశం ఉంది. అనుమానాస్పద స్థితిలో సునందా పుష్కర్ మరణించిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శశిథరూర్ ను మరోసారి ప్రశ్నించనుంది. ఈ సందర్భంగా ఆయనకు లైడిటెక్టర్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ గత గురువారం శశిథరూర్ ను ఇంటి పని వాడు నారాయణ్ సింగ్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అలాగే థరూర్ డ్రైవర్ బజరంగీని కూడా ప్రశ్నించింది. వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఢిల్లీలోని లూధియానా కాలనీలో ఉన్న కొందరు కెమిస్టులను కూడా ప్రశ్నిస్తున్నది. సునందా పుష్కర్ హోటల్ రూంలో లభించిన అల్ ప్రాక్స్ ట్యాబ్లెట్లను ఎవరు కొనుగోలు చేశారు. ఎక్కడ నుంచి కొనుగోలు చేశారన్న వివరాలు రాబట్టేందుకు ఆ కాలనీలోని కెమిస్టులను ప్రశ్నిస్తున్నది. ఈ క్రమంలోనే శశిథరూర్ ను కూడా మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందనీ, ఆయనకు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించే అవకాశాలను తోసిపుచ్చలేమని సిట్ వర్గాలు అంటున్నాయి.

English summary

Congress party leader Shashi Tharoor may undergo lie-detector test on Sunanda Death Case.In January last year, Delhi Police had registered a case of murder in connection with the death of Sunanda. An AIIMS medical board had found poisoning as reason for her death .