ఆమె ఇంటర్వ్యూ కావాలంటే 4 కోట్లు ఇవ్వాల్సిందే!

Lindsay Lohan demands 4 crores for her interview

07:02 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Lindsay Lohan demands 4 crores for her interview

హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ తన ఇంటర్వ్యూ కావాలంటే 5 లక్షల పౌండ్లు ఇవ్వలాని డిమాండ్ చేసింది. అంటే.. ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు నాలుగు కోట్ల రూపాయిలు. మరి, ఇంతలా డిమాండ్ వున్న ఈ ఇంటర్వ్యూ స్పెషాలిటీ ఏమిటంటారా? రష్యాకు చెందిన బిజినెస్ మెన్ ఇగోర్ తారాబాసోవ్ తో ప్రేమాయణం సాగిస్తోంది లిండ్సే లోహన్. ఈ లవ్ స్టొరీ ప్రస్తుతం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ లవ్ స్టొరీకి సంబంధించి విషయాలు చెప్పాలని రష్యాకి చెందిన ఛానల్ వన్ అనే టీవీ ఛానల్ ఆమె ఇంటర్వ్యూ కోరింది. దీనికి ఆమె డిమాండ్ చేసిన మొత్తం 4 కోట్లు.

అంతే కాదు.. తాను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే సెక్యూరిటీ, రిట్జ్-కార్లటన్ పెంట్ హౌస్ లో హాల్టింగ్, విమానంలో ప్రత్యేక మసాజ్, అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సెల్ఫీ..ఇలా తన కోరికల చిట్టా విప్పిందట లోహన్. అయితే ఆమెకు వున్న క్రేజ్ దృష్ట్యా ఆమె కోరిన కోరికలను తీర్చడానికి అంగీకరించిందట సదరు టీవీ ఛానల్.

English summary

Lindsay Lohan demands 4 crores for her interview